- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gaddar Cine Awards: గద్దర్ సినీ పురస్కారాలపై సూపర్‌స్టార్ మహేష్ బాబు అండ్ అనన్య నాగళ్ల రియాక్షన్
తాజాగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌పై టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌పై టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ సంద్భంగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో శ్రీమంతుడు, మహర్షి అండ్ మేజర్‌లు తమ స్థానాన్ని పొందడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ప్రారంభించి సినిమాను జరుపుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా దర్శకుల పట్ల.. దాని వెనుక ఉన్న ప్రతి హస్తం పట్ల ఉన్న గొప్ప ప్రేమకు థ్యాంక్స్’’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు తెలియజేశారు.
ఈ సూపర్‌స్టార్‌తో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మీ కష్టానికి విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుందని వెల్లడించింది. చాలా కాలం గడిచిపోయింది కానీ వేచి ఉండటం విలువైనదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. నా రెండు సినిమాలు #gaddarcineawards లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యానని తెలిపింది. ప్రతి ఒక్కరికీ చాలా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు అండ్ అనన్య నాగళ్ల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






