- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్లీ హెయిర్‌లో హీరోయిన్‌ను తలపిస్తున్న సూపర్ స్టార్ గారాల పట్టి.. కొంచెం పెద్ద మనసులో నాన్న లుక్స్ లీక్ చేయు తల్లి అంటూ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గారాలపట్టి సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గారాలపట్టి సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటించనప్పటికే హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ఉంది. పలు యాడ్స్‌లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక ఈ బ్యూటీకు ఉన్న ఫాలోవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా లేటెస్ట్ ఫొటో షూట్స్, వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సితార తన ఇన్‌స్టాగ్రామ్(Instagarm) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తన ఫ్యామిలీతో వేకెషన్స్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేసింది. అందులో కర్లీ హెయిర్‌తో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ.. ‘ఫ్లోరెన్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అమ్మా చిట్టి తల్లి కొంచెం పెద్ద మనసుతో నాన్నగారి లుక్స్ లీక్ చేసేయు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






