- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరుముడి విడుదలపై సూపర్ అప్డేట్?
రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ప్రస్తుతం సినిమా పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా ముగించి ఆగస్టు బరిలో సినిమాను నిలపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవలి కాలంలో రవితేజ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘ఇరుముడి’ సినిమాతో ఆయన మళ్లీ సాలిడ్ హిట్ అందుకుంటారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






