- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BVS Ravi: ఇండస్ట్రీలో రియల్ క్యారెక్టర్ ఉన్న హీరో రవితేజ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ రైటర్
రవితేజ లాంటి క్యారెక్టర్ ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారని బివిఎస్ రవి తాజాగా చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన కథా రచయితలలో బివిఎస్ రవి ఒకరు. ఈయన ‘జవాన్’ సినిమాతో దర్శకుడిగా కూడా కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో దర్శకుడిగా పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా బివిఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవి మాట్లాడుతూ.. “మన ఇండస్ట్రీలో సూపర్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్లో రవితేజ ఒకరు. ఆయన ఎవరికీ సలహాలు ఇవ్వరు.
అలాగే ఎవరిని సలహాలు అడగాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండదు. ఒక్క రూపాయి కూడా ఎవరిని అడిగి తీసుకోరు. కానీ ఎవరైనా సహాయం కోసం వస్తే మాత్రం ముందుండి సాయం చేస్తారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు” అని తెలిపారు. ప్రస్తుతం బివిఎస్ రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ నటించిన పలు చిత్రాలకు బివిఎస్ రవి పనిచేశారు. అలాగే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో కూడా రవి ఓ చిన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన పలు షోలకు పనిచేస్తూ బిజీగా ఉన్నారు.






