ఉస్తాద్ భగత్ సింగ్ నుండి సూపర్ అప్‌డేట్.. తమన్ ఓజీ రేంజ్‌లో అలరించనున్నాడా?

by Pulgam srinivas |

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ తాజాగా ఒక ఫోటోను విడుదల చేసింది. అందులో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, తమన్ ఉన్నారు. ఈ ఫోటో ఆధారంగా ఈ సినిమా డబ్బింగ్ పనులను పవన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి సూపర్ అప్‌డేట్.. తమన్ ఓజీ రేంజ్‌లో అలరించనున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోగా నటించాడు. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. మొదట మార్చి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా ఓ వారం ముందుగానే మార్చి 19వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను మార్చి 16వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాలోని పాటలకు సంగీతం అందించనుండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను విడుదల చేసింది. అందులో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, తమన్ ఉన్నారు. ఆ ఫోటో ఆధారంగా పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కొంతకాలం క్రితమే 'ఓజీ'తో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీనికి తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని సంగీతానికి మంచి ప్రశంసలు దక్కాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ద్వారా తమన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.




Next Story