ఆ ఒక్క స్టిల్‌తో ఉస్తాద్‌పై అంచనాలు పెంచేసిన హరీష్ శంకర్

by Pulgam srinivas |

ఒక్క స్టిల్ తో పవన్ అభిమానులకు ఫుల్ జోష్ తెచ్చిన హరీష్ శంకర్.

ఆ ఒక్క స్టిల్‌తో ఉస్తాద్‌పై అంచనాలు పెంచేసిన హరీష్ శంకర్
X

దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. ఈ మూవీ కంటే ముందు పవన్ అనేక ఫ్లాప్స్ ఎదుర్కొని డీలా పడిపోయి ఉన్నాడు. ఆ సమయంలో పవన్ కి గబ్బర్ సింగ్ విజయం ఎంతో కీలకం అయింది. ఇక ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. పవన్ అభిమానులు కూడా తమ అభిమాన హీరోని ఎలా చూడాలో అలా చూపించిన హరీష్ శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా దెబ్బకి హరీష్ శంకర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల స్థాయికి చేరిపోయాడు. గబ్బర్ సింగ్ భారీ సక్సెస్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబోలో ఇంకో సినిమా వస్తే బాగుండు అని పవన్ అభిమానులు భావించారు. అలాంటి పరిస్థితుల్లోనే వీరిద్దరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దానితో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా తమిళ చిత్రం అయినటువంటి తేరీకి రీమేక్ అని వార్తలు వచ్చాయి.




ఆ సినిమా అప్పటికే పోలీసోడు పేరుతో తెలుగులో విడుదల కావడంతో, అవుట్ డేట్ అయిపోయిన రీమేక్ సినిమా ఫార్ములా, అందులో తెలుగులో వచ్చేసిన సినిమా వీటన్నిటి కారణాలతో ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఈ మూవీ రీమేక్ కాదు, కొత్త కథతో రూపొందుతుంది అనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త పెరిగాయి. ఈ మూవీని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక ఫోటోను విడుదల చేసింది. అందులో మంచంపై కూర్చున్న పవన్ కి హరీష్ శంకర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ స్టిల్ అద్భుతంగా ఉంది. దానితో చాలామంది పవన్ అభిమానులు హరీష్ సీన్ చెప్పే కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా మరో గబ్బర్ సింగ్ అవుతుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.

Next Story