పవన్..రణ్‌వీర్ సినిమాలతో విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్

by Pulgam srinivas |

ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలతో పాటు సూర్య హీరోగా రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్..రణ్‌వీర్ సినిమాలతో విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని స్రే, బిజోర్న్ సర్‌రావు తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పనులు పూర్తయినట్లు, అలాగే సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ను మార్చి 19వ తేదీన విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలతో పాటు ప్రసారం చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటించారు.

హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ధురంధర్ 1 ఇప్పటికే భారీ విజయాన్ని సాధించడంతో దురంధర్ 2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటంతో ఈ రెండు సినిమాలతో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తే అద్భుతమైన రీచ్ వస్తుందనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Next Story