- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay: విజయ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడే ‘తలపతి-69’ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) గత ఏడాది ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(The Greatest of All Time) (గోట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) గత ఏడాది ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(The Greatest of All Time) (గోట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన చివరి చిత్రం ‘తలపతి-69’(Thalapathy-69)ను ప్రకటించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వినోత్(Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
అయితే ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఇందులో బాబీ డియోల్, యంగ్ బ్యూటీ మమిత బైజు, ప్రియమణి(Priyamani), ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే ‘తలపతి-69’ నుంచి వచ్చిన పోస్టర్లు అన్ని సినిమాపై హైప్ పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
#Thalapathy69 Update…🔜
— Christopher Kanagaraj (@Chrissuccess) January 21, 2025
Republic Day💥






