రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధమైన సెన్సేషనల్ మూవీ

by Gantepaka Srikanth |

సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) సినిమాల్లో బాషా సినిమా(Baasha Movie)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. రీరిలీజ్‌కు సిద్ధమైన సెన్సేషనల్ మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) సినిమాల్లో బాషా సినిమా(Baasha Movie)కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోని రజినీ స్టైల్‌ ప్రేక్షకులను తెగ మెప్పించింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘నేను ఒకసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లే’ డైలాగ్ కొన్ని తరాల ప్రేక్షకులను అలరించింది. తాజాగా రజినీకాంత్ ఫ్యాన్స్‌కు భాషా చిత్రబృందం శుభవార్త చెప్పింది. భాషా చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 25వ తేదీన తెలుగు, తమిళ్ పాటు పలు భాషల్లో రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన చేశారు. 1995లో విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నగ్మా(Nagma) హీరోయిన్‌గా నటించారు. రఘువరన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇందులో రజినీకాంత్ ఆటో డ్రైవర్‌గా యాక్టింగ్ చేశారు.

రజనీకాంత్ కెరీర్‌లో ఒక మైలురాయి చిత్రంగా భాషా నిలిచింది. దాదాపు 15 నెలలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. రజనీకాంత్ నటనకు ఫిల్మ్‌ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డు మరియు ఉత్తమ నటుడిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రాన్ని కన్నడలో కోటిగొబ్బ (2001)గా పునర్నిర్మించారు.

Next Story