- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Premalu-2: సూపర్ హిట్ ‘ప్రేమలు-2’ థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే!
తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఘన విజయాన్ని అందుకున్న మలయాళ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’(Premalu).

దిశ, సినిమా: తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఘన విజయాన్ని అందుకున్న మలయాళ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’(Premalu). ఇందులో మమిత బైజూ(Mamita Baiju), నస్లెన్ గపూర్, మ్యాథ్యూ ధామస్(Matthew Thomas) కీలక పాత్రల్లో నటించి దీనిని తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ(Kartikeya) రిలీజ్ చేశారు. భావనా స్టూడియోస్(Bhavana Studios) బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దీలీస్ పోతన్, శ్యామ్ నిర్మించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై ఏకంగా 130 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ప్రేమలు-2’ రాబోతున్నట్లు గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ప్రేమలు-2’ రిలీజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే జూన్‌లో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. ఈ ఏడాది చివరి నాటిని షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ నెలలో థియేటర్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పోస్టులు వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#Premalu2 update from Producer:
— AmuthaBharathi (@CinemaWithAB) January 18, 2025
Shooting begins from June 2025 & movie will release on Dec 2025 ❤️🔥. Currently location hunt & script final works are happening 🤝
One of the most anticipated film from Mollywood🤞 pic.twitter.com/tEi2Zww8Ao






