- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwambhara : విశ్వంభర హిందీ రైట్స్ కు సూపర్ క్రేజ్ !
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)హీరోగా ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటున్న విశ్వంభర(Vishwambhara) మూవీకి తెలుగు తో పాటు ఇతర భాషాలలోనూ మంచి డిమాండ్ నెలకొంటుంది.

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)హీరోగా ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంటున్న విశ్వంభర(Vishwambhara) మూవీకి తెలుగు తో పాటు ఇతర భాషాలలోనూ మంచి డిమాండ్ నెలకొంటుంది. తాజాగా విశ్వంభర హిందీ రైట్స్(Hindi rights)కు రూ.38కోట్లకు అమ్ముడుపోయినట్లుగా వెలువడిన వార్తలు వైరల్ గా మారాయి. విశ్వంభర హిందీ డీల్ తో జాతీయ స్థాయిలో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడినట్లేనని మేకర్స్ భావిస్తున్నారు. ఇక విశ్వంభర హిందీ డీల్ వ్యవహారం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం బాధ్యతలను ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి నిర్వహిస్తున్నారు. బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర సినిమాకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తి రేపుతోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి పాత్రకు దొరబాబు పెట్టారని సమాచారం. హీరోయిన్ ఈషా చావ్లా, ఆషికా రంగనాధ్ విశ్వంభర మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. హుషారు సినిమాలో నటించిన రమ్య పసుపులేటి కూడా ఈ మూవీలో ఉన్నారు.
విశ్వంభర నుంచి రిలీజైన పోస్టర్ లో చిరంజీవి వింటేజ్ లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. చాలగ్యాప్ తర్వాతా వస్తున్న చిరంజీవి సినిమా కావడంతో విశ్వంభర నిర్మాణంలో గ్రాఫిక్ వర్క్స్ సహా దేనిలోనూ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. విశ్వంభర సినిమాను దర్శకుడు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి, శ్రీదేని నటించిన ఆ సినిమా చూసి అభిమానులు ఎంత థ్రిల్ అయ్యారో ఇప్పుడు విశ్వంభర సినిమాకు కూడా అదే ఫీలింగ్ కలిగేలా ప్లాన్ చేస్తున్నాడు.
విశ్వంభర ట్రైలర్, గ్లిమ్స్ లలో విఎఫ్ఎక్స్ వర్క్స్ బాగాలేవన్న విమర్శల నేపథ్యంలో కొత్త టీమ్ తో విఎఫ్ఎక్స్ వర్క్స్ చేయించారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషన్స్ ను రంగంలోకి దింపారు. రూ.100కోట్ల మేరకు ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు.






