Sunny Leone: పోలీస్ ఆఫీసర్‌గా సన్నీ లియోన్.. టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్

by Chukka Sudharani |

ఇప్పటి వరకు బోల్డ్ బ్యూటీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్దం అవుతున్నది.

Sunny Leone: పోలీస్ ఆఫీసర్‌గా సన్నీ లియోన్.. టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: ఇప్పటి వరకు బోల్డ్ బ్యూటీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్దం అవుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. హై బడ్జెట్‌తో ఏకంగా పాన్ ఇండియా లెవల్‌లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్‌లో వచ్చేందుకు సిద్ధం అవుతుండగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఓటమి ఎరుగని శివంగి.. కానీ ఎదురుగా యుద్ధం.. తానెప్పుడూ సిద్ధం.. ఇప్పుడు ఎదురైంది ఛేదించలేని పద్మవ్యూహం.. తన చుట్టూ అలుముకుంది సందిగ్ధం.. కనుసైగతో సమస్యను గ్రహించే విషయపరిజ్ఞాని.. సమస్తమూ చదివిన జ్ఞాని.. అహంకారాన్ని అదుపు చేసుకోలేని అజ్ఞాని’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌పై సన్నీ లియోన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివంగి‌లా కనిపించి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రజెంట్ ఈ టీజర్ వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. లింక్

Next Story