- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదంలో సన్నీలియోన్... కిచెన్ లో విష పురుగులు.. !
సన్నీ లియోన్ కిచెన్ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా భయంకరమైన క్రిమి కీటకాలను చూపిస్తూ

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది భామలు... పాపులర్ కావడానికి.. బోల్డ్ సినిమాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో సన్నీలియోన్ ( Sunny Leone) ఒకరు.
దాదాపు 44 సంవత్సరాలు ఉన్న ఈ అందాల తార... చాలా బోల్డ్ సినిమాలలో నటించి సక్సెస్ అయ్యారు. ఇటు తెలుగులో కూడా ఈ అందాల తార చాలా సినిమాలే చేసింది. ఎక్కడ అవకాశాలు ఉన్న అక్కడ వాలిపోతూ... సక్సెస్ అందుకుంటుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా... ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఏజ్ బార్ అయినప్పటికీ... తన అంద చందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంది.
అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా.. హీరోయిన్ సన్నీ లియోన్ కిచెన్ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా భయంకరమైన క్రిమి కీటకాలను చూపిస్తూ.. జనాలకు కొన్ని సూచనలు కూడా చేసింది. తన కిచెన్ లో టమోటాలు పోసేటప్పుడు చిన్న చిన్న పురుగులు బయటకు వచ్చినట్లు వీడియోలో స్పష్టం చేసింది సన్నీలియోన్. అలాంటి పురుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరింది. తనకు ఎదురైన సమస్యల నేపథ్యంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది.






