- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sunny Deol: ఆ ప్లాప్ మూవీని రీమేక్ చేస్తున్న స్టార్ హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఇలాంటి సమయంలో ఆ సినిమా అవసరమా అంటున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) తాజాగా ‘జాట్’ (Jaat) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) తాజాగా ‘జాట్’ (Jaat) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కించి ఈ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకెట్ మూవీని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై వరిశంకర్ నిర్మించారు. రెజీనా కసాండ్రా (Regina Cassandra), వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చి మంచి హిట్ అందుకుంది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పార్ట్-2 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సన్నీ డియోల్ ప్రజెంట్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. 2018లో వచ్చిన మలయాళం చిత్రం ‘జోసెఫ్’ (Joseph)ను ఇప్పటికే తెలుగులో హీరో రాజశేఖర్ ‘శేఖర్’ అనే టైటిల్‌తో రీమేక్ చెయ్యగా దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఇదే సినిమాను సన్నీ డియోల్ హిందీలో మరోసారి ‘సూర్య’ అనే టైటిల్‌తో రిమేక్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ కావడంతో.. జాట్‌తో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఔట్ డేటెడ్ కథ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






