- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుకోకుండా వచ్చింది.. జీవితాన్నే మార్చేసింది.. సునీల్ కామెంట్స్ వైరల్
పుష్ప సినిమా తర్వాత తనుకు వచ్చిన పాపులారిటీపై నటుడు సునీల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

దిశ, సినిమా: సెకండ్స్ ఇన్సింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న నటుడు సునీల్.. తాజాగా తన సినిమా ‘కాటాలన్’ ప్రమోషన్స్‌లో పాల్గొని ‘పుష్ప’లో పాత్రపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రలో కనిపించిన సునీల్ తన యాక్టింగ్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సక్సెస్‌పై సునీల్ మాట్లాడుతూ.. ‘సుకుమార్ నుంచి నాకు వచ్చిన సర్‌ప్రైజింగ్ పాత్ర ‘పుష్ప’లో మంగళం శ్రీను. ఈ సినిమా తర్వాత నా జీవితం ఊహించని విధంగా మారిపోయింది. దీంతో ఇతర ఇండస్ట్రీ దర్శకులు కూడా నన్ను సరికొత్త కోణంలో చూడటం స్టార్ట్ చేశారు. ఈ బ్రేక్‌తో ‘జైలర్’లో ఆఫర్ వచ్చింది. ఇప్పుడు తమిళ సినిమా కాటాలన్‌లో ‘మారి’ అనే వపర్ ఫుల్ పాత్ర వచ్చింది. చాలా కాలం తర్వాత, నాకు ఎంతో సంతృప్తినిచ్చే ఒక పాత్ర లభించింది. ఇప్పుడు, వివిధ భాషల నుండి నాకు వైవిధ్యభరితమైన పాత్రలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక నటుడిగా, నా ఈ ప్రయాణాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.






