Sundeep Kishan: దేత్తడి ధమాకా.. చూసుకో తడాకా.. మాస్త్ మజాకా

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan)ఇటీవల ‘ఊరు పేరు భైరవ కోన’ రాయన్(Raayan), కెప్టెన్‌ మిల్లర్‌ వంటి సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Sundeep Kishan: దేత్తడి ధమాకా.. చూసుకో తడాకా.. మాస్త్ మజాకా
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan)ఇటీవల ‘ఊరు పేరు భైరవ కోన’ రాయన్(Raayan), కెప్టెన్‌ మిల్లర్‌ వంటి సినిమాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘మజాకా’(Mazaka ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని త్రినాథ రావు నక్కిన తెరకెక్కిస్తుండగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇందులో రావు రమేష్(Rao Ramesh) కీలక పాత్రలో నటిస్తుండగా.. అన్షు అంబానీ, రితూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా, సందీప్ కిషన్ అభిమానులకు మేకర్స్ సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు.

‘మాజాకా’ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆర్కే బీచ్‌లో తాగుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశానంటూ పోలీస్ చెప్తుండగా.. సందీప్ కిషన్, రితూ వర్మ కనిపిస్తారు. బీర్, మందు రెండిటిలో ఏది బెటర్ అని అడగ్గా.. దానికి సందీప్ రకుల్(Rakul Preet Singh) బెటరా.. రెజీనా అంటే ఏం చెప్పగలను అంటాడు. ఆ తర్వాత ఆయన తండ్రిగా నటించిన రావు రమేష్ అన్షు వెంట పడుతూ కనిపిస్తాడు. ఖాళీగా ఉన్నానని చేస్తున్నా అంటాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడినట్లు, పెళ్లి సమయంలో ఏదో ఇబ్బంది వచ్చినట్టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఈ టీజర్‌ను షేర్ చేస్తూ దేత్తడి ధమాకా.. చూసుకో తడాకా మాస్త్ మజాకా అనే క్యాప్షన్ జత చేశారు.

Next Story