- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sundeep Kishan: తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సందీప్ కిషన్.. ఆందోళనలో ఫ్యాన్స్!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) అందరికీ సుపరిచితమే. ‘వెంకటాద్రి’ (Venkatadri)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జోరు, బీరువా వంటి చిత్రాలతో తన క్రేజ్ పెంచుకున్నాడు. ఇక గత ఏడాది తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెప్టెన్ మిల్లర్(Captain Miller), రాయన్(Raayan) వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ ‘మజాకా’(MAZAKA)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రినాథరావు నక్కిన(Trinath Rao Nakkina) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేష్(Rao Ramesh), అన్షు అంబాని(Anshu Ambani) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రితు వర్మ(Rithu Verma) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె.ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ రోజు థియేటర్స్‌లోకి రానుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నాకు సైనస్ సమస్య ఉంది. సినిమా షూటింగ్‌లో గ్యాప్ దొరికినప్పడల్లా కార్ వ్యాన్‌లోకి నిద్రపోతాను. పడుకున్న తర్వాత నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుంది. ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను. మా అమ్మానాన్నతో కూడా నేను మాట్లాడకుండా ఉదయాన్నే వేడిగా టీ తాగి మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడుతాను. అయితే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి. కానీ ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖంలో మార్పులు వస్తాయని భయమేసి చేయించుకోవడం లేదు. నెలరోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సందీప్ కిషన్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






