- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలేలా సమ్మర్ హాలిడేస్ టీజర్..
రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సమ్మర్ హాలిడేస్ చిత్రం నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలకు మరపురానీ మధుర జ్ఞాపకం లాంటివి. పుస్తకాల సంచులు పక్కన పడేసి.. అమ్మమ్మ, నానమ్మ ఊర్లకు వెళ్లి అక్కడ కొత్త వాళ్లతో స్నేహం చేసి రెండు నెలలు ప్రపంచాన్నే మర్చిపోయే అంతగా ఎంజాయ్ చేస్తారు. అలా సమ్మర్ హాలిడేస్ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా మంది మదిలో మొదులుతూనే ఉంటాయి. అలాంటి చిన్ననాటి మెమోరీస్‌ను గుర్తు చేసేలా శ్రీకార్ నయన్ జి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ అండ్ వి.జి.బి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ పల్లెటూరి నేటివిటీ చిత్రం నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బిజీ లైఫ్‌లో పడి మర్చిపోతున్న మన బాల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతూ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






