వారణాసిపై సమ్మర్ ఎఫెక్ట్.. రాజమౌళి ప్లాన్ మొత్తం రివర్స్

by Pulgam srinivas |

ఈ వేసవిలో “వారణాసి” చిత్రానికి సంబంధించిన అండర్‌వాటర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ భావించినప్పటికీ, వాటికి అవసరమైన అనుమతులు లభించడం లేదని సమాచారం.

వారణాసిపై సమ్మర్ ఎఫెక్ట్.. రాజమౌళి ప్లాన్ మొత్తం రివర్స్
X

దిశ, వెబ్ డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా “వారణాసి” అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దాంతో ఈ మూవీ షూటింగ్‌ను జక్కన్న అత్యంత వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఒక విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అండర్‌వాటర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని రాజమౌళి భావించారు.

కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న నీటి సంక్షోభం కారణంగా వాటికి సంబంధించిన అనుమతులు పొందడం కష్టంగా మారినట్లు సమాచారం. ఇక ఈ సన్నివేశాలను తప్పనిసరిగా ఈ సమ్మర్‌లోనే పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాని కోసం అవసరమైతే విదేశాలకు వెళ్లినా, లేకపోతే సీజీఐ ఆప్షన్లను ఉపయోగించైనా పూర్తి చేయాలని చూస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కే.ఎల్. నారాయణ నిర్మిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Next Story