'వారణాసి' మూవీకి కొత్త చిక్కులు..షాక్ లో మ‌హేష్ ఫ్యాన్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 17:19:59  IST  )

'వారణాసి' మూవీ షూటింగ్ పై తీవ్ర‌మైన ఎండ‌ల ఎఫెక్ట్ ప‌డింది.

వారణాసి మూవీకి కొత్త చిక్కులు..షాక్ లో మ‌హేష్ ఫ్యాన్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏజ్ పైబడినప్పటికీ, కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు, ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే వారణాసి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

వారణాసి సినిమాపై ఎండల ఎఫెక్ట్ !

మహేష్ బాబు హీరోగా, జక్కన్న దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా షూటింగ్ కీలక షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ నేతృత్వంలో మహేష్ బాబుపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నట్లు టాక్. ఈ సాంగ్ పూర్తయిన వెంటనే సినిమా యూనిట్ మే నెలలో సమ్మర్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎండలు విపరీతంగా కొడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు, జక్కన్న తమ ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళ్లనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

Next Story