‘సుమతీ శతకం’ నుంచి కొత్త పాట

by Sujitha Rachapalli |

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుమతీ శతకం’.

‘సుమతీ శతకం’ నుంచి కొత్త పాట
X

దిశ, సినిమా : విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సుమతీ శతకం’. అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించగా.. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ‘సుమతి సుమతి...’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కృష్ణ మాదినేని రాసిన ఈ పాటకు గోల్డ్ దేవరాజ్ స్వరాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతం ఈ పాటను మరింత వినసొంపుగా మార్చింది. పాటలోని డాన్స్ స్టెప్స్ కూడా సింపుల్‌గా ఉంటూనే సరికొత్తగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నాయి.

Next Story