బడ్జెట్ సెట్ అవ్వక మధ్యలో బ్రేక్ పడింది.. ‘మహేంద్ర గిరి వారాహి’ చిత్రంపై సుమంత్ కామెంట్స్

by Chukka Sudharani |

సీనియర్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్ర గిరి వారాహి’.

బడ్జెట్ సెట్ అవ్వక మధ్యలో బ్రేక్ పడింది.. ‘మహేంద్ర గిరి వారాహి’ చిత్రంపై సుమంత్ కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్ర గిరి వారాహి’. ఆధ్యాత్మిక అంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. ‘మహేంద్ర గిరి వారాహి.. ఈ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు అవుతుంది. సంతోష్, నేను కొన్ని చర్చలు జరిపిన తర్వాత ప్రాజెక్ట్ ఓకే చేశాం. కానీ ఒక స్టేజ్‌లో ఆగిపోయింది.

ఈ సినిమా ఒక బడ్జెట్‌లో అనుకున్నాము. అయితే.. మా ఫస్ట్ ఆప్షన్ (ప్రోడ్యూసర్స్)తో మాకు సెట్ అవ్వక వద్దు అనుకుని వెయిట్ చేశాము. అప్పుడే మధు, లక్ష్మణ్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాను కరెక్ట్‌గా మౌంట్ చేయడానికి మాకు అవసరమైన ఆర్థిక సహాయం, ప్లానింగ్ సహాయం అంతా ఇచ్చారు. ఈ సినిమాకు ఈ బడ్జెట్ ఎంతో అవసరం. నిజంగా మీరు ఈ సినిమా టీజర్‌ను ఇంత హిట్ ఇచ్చి వైరల్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు. మీరు చూసినదాంట్లో ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఇంకా చాలా ఉంది. ఇందులో చాలా సర్‌ప్రైజులు, ట్విస్టులు ఉన్నాయి. ఊహించని సన్నివేశాలు, మలుపులు ఉన్నాయి. ఈ సినిమాను ఇంకా చెక్కి, పాలిష్ చేసి సెప్టెంబర్ 11న మీ ముందుకు వస్తున్నాం.. కచ్చితంగా ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

Next Story