Sumanth Prabhas: హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |

‘మేమ్ ఫేమస్’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ నటుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Sumanth Prabhas: హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: ‘మేమ్ ఫేమస్’తో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ నటుడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తుంది. ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu), రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina)ను ఫిక్స్ చేశారు. ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని హిట్ పాట అని అందరికి తెలిసిందే. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలో పదాన్నే టైటిల్‌గా ఫిక్స్ చేయడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున మీ స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. రిలాక్స్‌గా, అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. గోదావరి జిల్లాల వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో సెట్ చేయబడిన స్వచ్ఛమైన చిత్రానికి గోదారి గట్టుపైన అని పేరు పెట్టారు. పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు సినిమా విజువల్ గ్రాండియర్‌లో పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.

Next Story