Suma Kanakala: నవ్వడానికి సిద్ధంగా ఉండండి.. వెండితెరపై సుమ కనకాల సందడి!

by Chukka Sudharani |

ఇప్పటి వరకు బుల్లితెరపై నవ్వులు పూయించిన స్టార్ యాంకర్ సుమ కనకాల.. ఇప్పుడు వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Suma Kanakala: నవ్వడానికి సిద్ధంగా ఉండండి.. వెండితెరపై సుమ కనకాల సందడి!
X

దిశ, సినిమా: ఇప్పటి వరకు బుల్లితెరపై నవ్వులు పూయించిన స్టార్ యాంకర్ సుమ కనకాల.. ఇప్పుడు వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. ‘థ్రిల్ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సునీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ‘ప్రేమంటే’ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ నవ్వులు పూయించగా.. ఇప్పుడు ఈ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చడానికి అడుగు పెట్టబోతున్నదట సుమ. ఈ సినిమాలో సుమ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుండగా.. ‘సాధారణ పోలీసు కాదు.. నవ్వడానికి సిద్ధంగా ఉండండి.. ఫైనల్‌గా సుమ కామెడీ టైమింగ్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నాం’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లింక్

Next Story