- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా కోసం ఆ పనిచేసిన కూతురు.. కన్నీరు పెట్టిన సుకుమార్ భార్య
పుష్ప-2 సినిమాతో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుకుమార్(Sukumar) తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిచారు. బాహుబలి-2 రికార్డులు తిరగరాసి కొత్త రికార్డులు నెలకొల్పారు.

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమాతో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుకుమార్(Sukumar) తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిచారు. బాహుబలి-2 రికార్డులు తిరగరాసి కొత్త రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్ల వరకు పుష్ప-2 కలెక్ట్ చేసినట్లు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. ఇదిలా ఉండగా.. గాంధీతాత చెట్టు(Gandhi Tatha Chettu) అనే సినిమాతో సుకుమార్ కూతురు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఈనెల 24న సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ ప్రెస్‌మీట్‌లో సుకుమార్‌తో పాటు ఆయన భార్య తబిత(Thabitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె సుకృతి వేణి గురించి చెబుతూ తబిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ వయసులో ఏ అమ్మాయి కూడా గుండు చేయించుకోవడానికి ఇష్టపడదని.. కానీ గాంధీ తాత చెట్టు సినిమా కోసం తన కుమార్తె ఏ భయం లేకుండా గుండు చేయించుకున్నదంటూ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ పేరు వాడకుండా చిత్రం రూపొందించాలనుకున్నాం.. ఈ సినిమా అవార్డులు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






