బుట్టబొమ్మకు లవర్స్ డే గిఫ్ట్‌గా 30కోట్ల హెలికాప్టర్ ఇచ్చా..జైలు నుండి సుఖేశ్ లేఖ

by Ajay Maddhiboyina |

200 కోట్ల రూపాయాల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ ఓ లేఖను విడుదల చేశాడు. లేఖలో సంచలన విషయాలను వెల్లడించాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే కస్టమైజ్డ్ హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు.

బుట్టబొమ్మకు లవర్స్ డే గిఫ్ట్‌గా 30కోట్ల హెలికాప్టర్ ఇచ్చా..జైలు నుండి సుఖేశ్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: 200 కోట్ల రూపాయాల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ ఓ లేఖను విడుదల చేశాడు. లేఖలో సంచలన విషయాలను వెల్లడించాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే కస్టమైజ్డ్ హెలికాప్టర్ బహుమతిగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. లేఖలో పదే పదే జాక్వెలిన్ ను బుట్టబొమ్మ అంటూ సంబోధించాడు. బేబీ నువ్వు మహారాణివి నీకు తగిన ప్రత్యేక బహుమతిని ఏర్పాటు చేశానని పేర్కొన్నాడు.

హెలికాప్టర్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఇంటీరియర్లు జాక్వెలిన్ అనే అక్షరాలతో జెఎఫ్ అని ఉన్నాయని తెలిపాడు. ఈ హెలికాప్టర్ ఎంతో విలాసవంతంగా ఉంటుందని పేర్కొన్నాడు. ప్రపంచమంతా వాలంటైన్స్ డే వేడుకల్లో వెలిగిపోతున్నాప్పుడు నువ్వు నా పక్కన లేకపోవడం చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. తన హృదయం మాట‌ల్లో చెప్ప‌లేనంత బాధ‌ను అనుభ‌విస్తోంద‌న్నాడు.

త‌న ప్ర‌తి హృద‌య స్పంద‌న త‌న ప్రేయ‌సి మ‌ధ్య దూరాన్ని గుర్తు చేస్తోంద‌ని, ప్ర‌తి శ్వాస ఆమె పేరునే త‌లుచుకుంటోంద‌ని పేర్కొన్నాడు. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌లో ఎడారిలో త‌ప్పిపోయిన మ‌నిషిలా నిన్ను మిస్ అవుతున్నానంటూ ఆవేదన వ్య‌క్తం చేశాడు. ఇదిలా ఉంటే గ‌తంలోనూ సుఖేష్ ఇలాంటి లేఖ‌లు రాశాడు. కానీ జాక్వెలిన్ మాత్రం సుఖేష్ తో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పుకొచ్చింది.

Next Story