‘బ్లడీ రోమియో’ను పక్కన పెట్టిన సుజీత్.. అసలు మ్యాటర్ అదే

by Pulgam srinivas |

వాతావరణ పరిస్థితుల కారణంగా ‘బ్లడీ రోమియో’ చిత్ర పనులను సుజీత్ తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

‘బ్లడీ రోమియో’ను పక్కన పెట్టిన సుజీత్.. అసలు మ్యాటర్ అదే
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్, నాని హీరోగా ‘బ్లడీ రోమియో’ అనే సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ప్రస్తుతం షూటింగ్ పరిస్థితులను బట్టి చూస్తే ఆ సమయానికి విడుదల కావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. దీంతో ‘ది ప్యారడైజ్’ పూర్తయ్యాక ‘బ్లడీ రోమియో’ను ప్రారంభించాలని ప్లాన్ చేసిన సుజీత్‌కు షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాలని భావిస్తున్నారని, అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం షూటింగ్‌కు అనుకూలంగా లేవని సమాచారం. ఈ కారణాలతో సుజీత్ ప్రస్తుతం ‘ఓజీ 2’ స్క్రిప్ట్ పనులపై దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story