- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘OG2’ స్క్రిప్ట్‌పై సుజీత్ ఫోకస్!
‘రన్ రాజా రన్’తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ‘సాహో’ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నా యంగ్ డైరెక్టర్ సుజిత్..

దిశ, సినిమా: ‘రన్ రాజా రన్’తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ‘సాహో’ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నా యంగ్ డైరెక్టర్ సుజిత్.. రీసెంట్‌గా OG తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. ఈ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చెయ్యగా.. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడినట్లు టాక్. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యేందుకు టైమ్ పట్టనున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. నాని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, సుజిత్ తన సమయాన్ని వృథా చేసుకుండా ఇప్పుడు తన ఫోకస్‌ను OG 2పై పెట్టాడట. ఈ క్రమంలోనే OG2 స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారట సుజిత్. దీంతో నాని చిత్రం తర్వాత OG2 నే ఉండొచ్చనే టాక్ ఫిలిమ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. దీంతో ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ కావడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్.






