Suhas: పుకార్లకు చెక్ పెట్టిన సుహాస్.. ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas), కోలీవుడ్ నటుడు సూరి(suri) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మండాడి’(Mandaadi).

Suhas: పుకార్లకు చెక్ పెట్టిన సుహాస్.. ఆ విషయంపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas), కోలీవుడ్ నటుడు సూరి(suri) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మండాడి’(Mandaadi). దీనిని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaran) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో మహిమా నంబియార్(Mahima Nambiar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందులో సుహాస్, సూరి గుబురు గడ్డం జుట్టుతో వైల్డ్ లుక్‌లో కనిపించారు. అయితే ఇందులో సుహాస్ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతోనే ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై సుహాస్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘హలో గాయ్స్ నేను అందరికీ ఓ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నా రాబోయే తమిళ చిత్రం మండాడిలో నేను హీరోగా నటించడం లేదు. ఇది తెలుగులో కూడా విడుదల అవుతుంది. అన్ని ఊహాగానాల పుకార్లకు భిన్నంగా, నేను విలన్ పాత్రను మాత్రమే పోషిస్తున్నాను. సూరి అన్నా కథానాయకుడిగా ఉంటారు’’ అని రాసుకొచ్చాడు.

Next Story