ఒక సినిమా.. రెండు టైటిల్స్.. సుహాస్ సూపర్ రికార్డ్

by Pulgam srinivas |

సుహాస్ తాజాగా నటించిన చిత్రాన్ని ఇండియాలో హే బల్‌వంత్, ఓవర్సీస్‌లో హే భగవాన్ అనే పేర్లతో విడుదల చేశారు.

ఒక సినిమా.. రెండు టైటిల్స్.. సుహాస్ సూపర్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు సుహాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సినీ పరిశ్రమలో ప్రారంభ దశలో ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అలాంటి సమయంలోనే ఈ నటుడికి మజిలీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈయన మొదటగా కలర్ ఫోటో అనే చిత్రంలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సుహాస్ కి వరుసగా హీరోగా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా ఈ నటుడు హే బల్‌వంత్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. శివానీ నాగారం హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, నరేష్, స్రవంతి చొక్కారపు, సుదర్శన్ ముఖ్యపాత్రల్లో నటించారు. గోపి అర్చర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మొదట హే భగవాన్ అనే టైటిల్ ఖరారు చేశారు. దాంతోనే ప్రచారాలను కూడా నిర్వహించారు. కానీ ఆఖరి నిమిషంలో ఈ సినిమాకు టైటిల్ను మార్చి హే బల్‌వంత్ గా ఖరారు చేశారు. సెన్సార్ బోర్డు వారు ఈ టైటిల్ పై అభ్యంతరాలు తెలపడం వల్లే టైటిల్ను మార్చారు అని వార్తలు కూడా వచ్చాయి.

ఈ సినిమా టైటిల్ విషయంలో సుహాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. దాదాపుగా ఒక సినిమా రెండు, మూడు పేర్లతో విడుదల కావడం సర్వసాధారణం. కానీ అది డబ్బింగ్ సినిమా విషయంలో జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఇండియాలో హే బల్‌వంత్ అని, ఓవర్సీస్ లో హే భగవాన్ అని విడుదల చేశారు. ఇలా ఒకే సినిమా ఒకే భాషలో వేరువేరు ప్రాంతాల్లో రెండు టైటిల్స్ తో విడుదల కావడం జరిగింది. ఇలా జరగడం చాలా అరుదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story