- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఒక ఘోస్ట్ హంటర్.. హీరో సుధీర్ బాబు కామెంట్స్ వైరల్
మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’.

దిశ, సినిమా: మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఈ పాన్ ఇండియా ద్విభాషా చిత్రం నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు తాజా ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషాయలు పంచుకున్నాడు. అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ప్రజెంట్ టైం లోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రజెంట్ చేశారు. సినిమాలో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటాయి. ఘోస్ట్ హంటింగ్, ఫ్యామిలీ ఎమోషన్, డివోషనల్, శివుడు గురించి కథలు. ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. సినిమాలో ఉన్న కాన్ఫ్‌ఫ్లిక్ట్‌కి మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు సొల్యూషన్‌గా ఈ కథను చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నాకు చాలా ఎక్సైట్ అనిపించింది.
యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. ఇందులో ఘోస్ట్ హంటర్‌గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్‌ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జటాధర అనే టైటిల్ వినగానే ఇది డివైన్ సినిమాని తెలుస్తుంది. ఫైనల్‌గా శివుడు వస్తాడని ముందే అర్ధమౌతుంది. అయితే ఆ పాయింట్‌కి రీచ్ అయ్యేవరకూ ఉండే జర్నీ చాలా ఎక్జైటింగ్‌గా ఉంటుంది, ఆడియన్స్‌ని కచ్చితంగా థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు. ఇంకా తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. ‘రాహుల్ రవీంద్రన్‌తో ఒక సినిమా ఉంది. ఇప్పుడు వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి’ అని తెలిపారు.






