రజినీకాంత్‌తో లవ్ స్టోరీ ప్లాన్.. లేడీ డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..

by Sujitha Rachapalli |

‘పరాశక్తి’తో హిట్ కొట్టేందుకు సిద్ధమైంది డైరెక్టర్ సుధా కొంగర. శివ కార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. చిత్రం

రజినీకాంత్‌తో లవ్ స్టోరీ ప్లాన్.. లేడీ డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..
X

దిశ, సినిమా : ‘పరాశక్తి’తో హిట్ కొట్టేందుకు సిద్ధమైంది డైరెక్టర్ సుధా కొంగర. శివ కార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సాఫ్ట్, ఎమోషన్ డ్రివెన్ లవ్ స్టోరీ చేయాలనేదే తన కల అని.. ఆయనను కంప్లీట్‌గా న్యూ అండ్ రిఫ్రెషింగ్ సైడ్ చూపించాలనేదే తన కోరిక అని తెలిపింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని.. డేట్స్ సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ‘పరాశక్తి’ సినిమా 1970లలో హిందీ ఇంపోజింగ్ కారణంగా కలిగిన ఉద్యమం గురించి వివరిస్తుంది. అయితే సెన్సార్ బోర్డు కీలకమైన సీన్స్ కట్ చేయగా రివ్యూ కమిటీకి వెళ్లిన మూవీ టీమ్.. విడుదలను క్లియర్ చేసుకుంది.

Next Story