- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suddala Ashok Teja: శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి కారణం అదే
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ... శ్రీహరి పాన్ అధికంగా తినడం వల్లే కాలేయ సమస్య వచ్చి సన్నబడి మరణించినట్లు ఈ ప్రముఖ గేయ రచయిత చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో దివంగత నటుడు 'శ్రీహరి'తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. శ్రీహరి బాలానగర్‌లో పాల వ్యాపారం చేసుకుంటూ పేదరికం నుండి పైకి వచ్చాడు. ఆయన నా పాటలను ఎంతగానో ఇష్టపడేవారు. మొదటిసారి రాములమ్మ చిత్రంలోని పాటల వల్ల ఆయనకు, నాకు మధ్య స్నేహం ఏర్పడింది. ఒకానొక సమయంలో నేను తీవ్ర నిరాశలోకి వెళ్ళాను. దాంతో ఇండస్ట్రీలో కొనసాగడం అనవసరం, తిరిగి వెళ్లి ఉద్యోగం చేసుకోవాలి అనుకున్నాను.
అలాంటి సమయంలో నాకు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలిచింది శ్రీహరి. ఆయన నా దగ్గరకు వచ్చి "తిరిగి వెళ్లి నువ్వు ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నావు, అలా చేయకు. నీకు ఎంతో పెద్ద భవిష్యత్తు ఇక్కడ ఉంది. నేను 17 సినిమాల్లో హీరోగా సైన్ చేశాను. అందులో ప్రతి దాంట్లో నీకు ఒక పాట ఉంటుందని" చెప్పాడు. అలాగే "ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అది నాకు అర్థం అవుతుంది. నువ్వు కాస్త సెట్ అయ్యే వరకు నెలకు పదివేల రూపాయలు పంపిస్తాను" అని ఆయన అన్నాడు.
నేను ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకోలేదు, కానీ శ్రీహరి ఇచ్చిన ధైర్యం నా జీవితం ముందుకు వెళ్లడానికి సహాయపడింది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం 'భద్రాచలం' చిత్రంలో 'ఒకటే జననం ఒకటే మరణం' పాటకు స్ఫూర్తి. శ్రీహరి మరణం గురించి మాట్లాడుతూ... మేస్త్రి సినిమా సమయంలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. భద్రాచలం సమయంలో ఎంతో పుష్టిగా, ఆరోగ్యంగా ఉన్న ఆయన చాలా సన్నబడ్డాడు. అప్పటికే ఆయనకు కాలేయ సమస్య బాగా పెరిగిపోయింది. పాన్ అధికంగా తినడం వల్లే ఆయనకు కాలేయ సమస్య వచ్చి సన్నబడి మరణించినట్లు ఆ తర్వాత తెలిసిందని అశోక్ తేజ చెప్పుకొచ్చాడు.






