- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీలో అలాంటి సీన్లు..ట్విస్ట్ అదుర్స్ !
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తున్న ప్రజ్వల్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. RRR లాంటి బంపర్ హిట్ సినిమాతో హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేవర మూవీతో సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి బడా దర్శకుడితో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ సినిమాపై బిగ్ అప్డేట్
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తున్న ప్రజ్వల్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రామోజీ ఫిలిం సిటీలో తాజాగా షూటింగ్ జరుపుకున్నామని.. ఈ సందర్భంగా నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అత్యుత్తమ సినిమాగా డ్రాగన్ నిల్వనుందట. కాగా, ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో వచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.






