- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చమ్మక్ చంద్రతో ఉన్నది అలాంటి సంబంధం మాత్రమే.. వైరల్‌గా మారిన సత్య శ్రీ కామెంట్స్
జబర్దస్త్ సత్య శ్రీ మాట్లాడుతూ... చంద్ర గారితో ఉన్నది గురు-శిష్యుల సంబంధం మాత్రమే అని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో సత్య శ్రీ ఒకరు. ఈ మధ్యకాలంలోనే ఈమె జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ నటి జబర్దస్త్‌లో ఎక్కువగా చమ్మక్ చంద్ర టీంలో స్కిట్స్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఈమె కూడా ఆ షో నుంచి బయటకు వచ్చింది. ఇక చంద్ర, సత్య శ్రీల గురించి గతంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా సత్య శ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చమ్మక్ చంద్ర గురించి, అలాగే జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను స్పష్టంగా వివరించింది.
సత్య శ్రీ మాట్లాడుతూ… "నాకు చమ్మక్ చంద్ర గారు గురువులాంటివారు. అంతకుమించితే మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మొదట్లో నాకు నటనంటే కొంచెం భయం ఉండేది. జబర్దస్త్‌లోకి వచ్చి చంద్ర గారి టీంలో చేరిన తర్వాత ఆయన శిక్షణలో నేను చాలా మెరుగయ్యాను. నటనపై ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాను. మాపై అనేక రూమర్లు వచ్చినప్పటికీ వాటిని నేను పట్టించుకోలేదు. మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను ఆ విషయంలో ఎంతో సపోర్ట్ చేశారు. చంద్ర గారిని నేను జబర్దస్త్ సెట్లో, రిహార్సల్స్ సమయంలో తప్ప బయట ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం గురు-శిష్యుల అనుబంధం మాత్రమే. ఇక నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం, మొదటి నుంచి చంద్ర గారి టీంలోనే స్కిట్లు చేస్తూ వచ్చాను, ఆయన వెళ్లిపోయిన తర్వాత నేను కూడా ఆ షో నుంచి బయటకు వచ్చాను" అని సత్య శ్రీ చెప్పుకొచ్చింది.






