- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు.. ‘మదం’ మూవీపై హైప్ పెంచిన డైరెక్టర్
హర్ష గంగవరపు(Harsha Gangavarapu), లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన(Inaya Sultana) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మదం’.

దిశ, సినిమా: హర్ష గంగవరపు(Harsha Gangavarapu), లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన(Inaya Sultana) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మదం’. ఏకైవ హోమ్స్ ప్రై.లి. బ్యానర్ మీద సూర్యదేవర రవీంద్రనాథ్(Suryadevara Rabindranath) (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా(Vamsi Krishna Malla) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మార్చి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘మదం’ టీజర్‌ను తండేల్ సినిమాతో పాటుగా థియేటర్లలో యాడ్ చేశారు. ప్రస్తుతం మదం మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ టీజర్ సక్సెస్ అయిన సందర్భంగా
డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘మా మదం సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నిర్మాత రమేష్ గారు ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళ్, మలయాళీ భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. మదం కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు.
అనంతరం రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ.. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీజర్‌ను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు. ఇక హర్ష గంగవరపు.. ‘మదం సినిమాకు కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. కథ చాలా బాగుంటుంది. దానికి తగ్గ పాత్రలు అందరికీ పడ్డాయి. అన్ని కారెక్టర్స్ బాగుంటాయి. నటించే స్కోప్ అందరికీ దొరికింది. మా రమేష్ గారి కథ, వంశీ గారి మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.






