SYG: ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి సుబ్బి పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న నటుడు సీరియస్ లుక్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-09 12:04:26  IST  )

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

SYG: ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి సుబ్బి పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న నటుడు సీరియస్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రోహిత్ కేపీ(Rohit KP) దర్శకత్వంలో ‘సంబరాల ఏటిగట్టు’(Sambara Yetigattu) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్‌లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) నటిస్తోంది.

అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి(chaitanya Reddy), నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికీ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా తాజాగా ఓ నటుడు పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీటీమ్. నేడు నటుడు రవి క్రిష్ట(Ravi Krishna) బర్త్‌డే స్పెషల్‌గా సంబరాల ఏటిగట్టు నుంచి అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేస్తూ.. ‘సంబరాల ఏటిగట్టు నుండి ప్రతిభావంతులైన నటుడు రవికృష్ణ అకా SUBBIకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని విషెస్ తెలిపారు. కాగా ఈ మూవీలో ఆయన సుబ్బి క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్‌లో ఆయన వైల్డ్ లుక్‌లో అదిరిపోయాడు.

Next Story