- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Su from So: ‘సు ఫ్రమ్ సో’ నటుడు మరో కొత్త ప్రయోగం.. పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలతో హైలెట్‌గా ప్రోమో
రీసెంట్‌గా ‘సు ఫ్రమ్ సో’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి.. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘సు ఫ్రమ్ సో’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ నటుడు రాజ్ బి. శెట్టి.. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. కన్నడ రచయిత కేపీ పూర్ణచంద్ర తేజస్వి రాసిన ఐకానిక్ నవల ‘జుగారి క్రాస్’ ఆధానంగా ఇది తెరకెక్కబోతుండగా.. దీనికి గురుదత్ గనిగ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేసిన ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో టైటిల్ ప్రోమో దుమ్ములేపేసింది. ఇక ఇందులో చూపించిన పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలు చూస్తుంటే భారీ యాక్షన్ చిత్రంగా రానున్నట్టు కనిపిస్తోంది. రాజ్ బి. శెట్ తన పాత్రల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో అందరికీ తెలిసిందే. ఎల్లప్పుడూ ప్రత్యేకమైన, అసాధారణమైన పాత్రలను చేస్తూ విజయాన్ని అందుకుంటున్నా ఈయన.. ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అనే ఆసక్తి ఆడియన్స్‌లో నెలకొంది.






