- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renu Desai: మూర్ఖత్వం భయంకరంగా ఉంది.. ఈ పోస్ట్ అన్ని మతాల వారికి వర్తిస్తుందంటూ రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె గతంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె గతంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు రేణు దేశాయ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన పిల్లలకు చూసుకుంది.ఈ క్రమంలో అడపా దడపా మూవీస్ చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది, రెగ్యులర్‌గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అలాగే తన పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా పోస్టులతో పెడుతోంది. అంతేకాకుండా జంతువుల కోసం విరాళాలు కలెక్ట్ చేసి మరీ వాటి బాగోగులు చూసుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘గత 5 రోజులుగా నేను చూసిన మానవత్వం, మూర్ఖత్వం, అర్ధంలేనితనం చాలా బాధించింది. నేను కాశీ ఘాట్ ప్రాంతంలోని బై లేన్లలో తప్పిపోయి పొరపాటున మెయిన్ రోడ్డుకి వచ్చాను.
మనుషుల్లో నేను చూసిన మూర్ఖత్వం స్థాయి చాలా భయంకరంగా ఉంది. జనాలు ఒకరినొకరు తోసుకుంటూ, లాక్కుంటూ, పెద్దగా పెద్దగా అరుస్తూ కనిపించారు. ఎటువంటి సివిక్ సెన్స్ లేకుండా రోడ్లపై పోకిరీల మాదిరిగా స్టుపిడ్ DJ మ్యూజిక్ పెట్టి, డ్యాన్సులు చేయడాన్ని ఏ దేవుడు సంతోషిస్తాడు?. ఈ పోస్ట్ అన్ని మతాలకు, వారి సహ మానవుల సభ్యతకు అంతరాయం కలిగించే అన్ని దేవుళ్లకు భయపడే వ్యక్తులకు వర్తిస్తుంది! నిజంగా మనుషులు తమ వివేకాన్ని, విచక్షణను కోల్పోయి సామూహిక మూర్ఖత్వం వైపు వెళ్తున్నారు. కలియుగం అంటే ఇదేనని నేను అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






