షూటింగ్‌లో మృతి చెందిన స్టంట్‌ మ్యాన్‌.. అక్షయ్‌ కుమార్ గొప్ప నిర్ణయం

by Yella Dhawani Reddy |

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

షూటింగ్‌లో మృతి చెందిన స్టంట్‌ మ్యాన్‌.. అక్షయ్‌ కుమార్ గొప్ప నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ (Bollywood star Akshay Kumar) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల తమిళ సినిమా ‘వేట్టువం’ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్‌ మ్యాన్‌ రాజు మృతి చెందారు. ఈ ఘటన అక్షయ్‌ను తీవ్రంగా కలిచివేసింది. సినిమాల్లో రిస్క్‌ టేకింగ్‌ చేసే స్టంట్‌ ఆర్టిస్ట్‌ల భద్రతపై ఆయన గతంలోనూ పలు మార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ దురదృష్టకర సంఘటన తర్వాత, 650 మంది స్టంట్‌ మ్యాన్‌లకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తూ అక్షయ్‌ ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వయంగా ఈ పాలసీల ఖర్చును భరించడమే కాక, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకూడదని బలమైన సందేశం ఇచ్చారు. ఓ నటుడిగా మాత్రమే కాక, మానవతావాది గానే ఆయన తీసుకున్న ఈ చర్యకు సినీ పరిశ్రమ అంతా ప్రశంసలు కురిపిస్తోంది.

Next Story