- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిపోయిన బాలయ్య - వివేక్ ఆత్రేయ మూవీ.. లిస్ట్‌లోకి ఆ హీరో?
బాలయ్య - వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ - వివేక్ ఆత్రేయ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ కానున్నట్లు గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ సినిమా ఏకంగా రెండు భాగాలుగా రూపొందనున్నట్లు, దీనిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్లు, అలాగే దసరా తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా వార్తలు పెద్ద ఎత్తున రావడంతో ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయిందని అభిమానులు కూడా భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఆగిపోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక బాలయ్యతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా తాజాగా ఆయన రవితేజకు ఓ కథ వినిపించగా, ఆ స్టోరీ ఈ మాస్ హీరోకు బాగా నచ్చడంతో వెంటనే వివేక్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






