ఆ అవకాశం వదులుకుని ఇప్పటికీ బాధపడుతున్నా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని(Priya Vadlamani) ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఆ అవకాశం వదులుకుని ఇప్పటికీ బాధపడుతున్నా.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా వడ్లమాని(Priya Vadlamani) ‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘హుషారు’(Husharu)మూవీతో అమ్మడు కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. ఆ తర్వాత శుభలేఖలు, వీరాంజనేయులు విహారయాత్ర(Veeranjaneyulu Vihara Yatra) వంటి మూవీస్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఈ అమ్మడు ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam)సినిమాతో వచ్చి తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘కలర్ ఫొటో సినిమా చాన్స్ ముందు నాకే వచ్చింది. కానీ అది నాకు సరైన ప్రాజెక్ట్ అని అప్పుడు ఆలోచన తట్టలేదు. గైడ్ చేసే వారు కూడా లేరు. దీంతో ఏ సినిమా సెలెక్ట్ చేసుకోవాలి.. ఏది వదిలేయాలి అని అవగాహనలేకపోవడంతో అలా చేశాను. నేను అమ్మానాన్న కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. ఆ సమయంలో నాకు కొంచెం సమయం కావాలని చెప్పాను కానీ పల్లెటూరి అమ్మాయిలా సెట్ కానని మంచి ఆఫర్ వదులుకున్నా. అంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నా అని ఇప్పటికీ బాధపడుతున్నాను. నా జీవితంలో అదొక పెద్ద రిగ్రెట్’’ అని చెప్పుకొచ్చింది.

Next Story