ఓటీటీ సినిమాతో రాబోతున్న స్టార్ హీరో కొడుకు.. ‘నాదానియన్’ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

స్టార్ కిడ్స్ అంతా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ తమ పాపులారిటీ పెంచుకుంటున్న విషయం తెలిసిందే.

ఓటీటీ సినిమాతో రాబోతున్న స్టార్ హీరో కొడుకు.. ‘నాదానియన్’ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: స్టార్ కిడ్స్ అంతా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ తమ పాపులారిటీ పెంచుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల, హీరోయిన్ల పిల్లలు నటనపై ఆసక్తితో సినిమాలు చేస్తున్నారు. కొంతమంది ఒక మూవీతోనే మెప్పించి స్టార్‌గా మారిపోతే.. మరికొందరు మాత్రం ఎక్కువ చిత్రాలు చేసినప్పటికీ ఫేమ్ తెచ్చుకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు అబ్రహం అలీ ఖాన్(Abraham Ali Khan) సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు.

శౌనా గౌతమ్(Shauna Gautam) దర్శకత్వం వహించిన ‘నాదానియన్’ (Nadanian)చిత్రంలో ఇబ్రహీం హీరోగా నటించాడు. ఆయనకు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్(Khushi Kapoor) హీరోయిన్‌గా నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ నేరుగా ఓటీటీలోకి వస్తున్నట్లు ఇటీవల ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. కానీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. తాజాగా, ఇబ్రహీం మూవీ డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ‘నాదానియన్’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది.

Next Story