సెన్సార్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో సినిమా.. ‘A’ సర్టిఫికెట్ రావడంతో అంతా షాక్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-12 12:30:02  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్-2’(Kesari Chapter-2). ఈ సినిమా ‘కేసరి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో సినిమా.. ‘A’  సర్టిఫికెట్ రావడంతో అంతా షాక్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్-2’(Kesari Chapter-2). ఈ సినిమా ‘కేసరి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ 1919 జలియలి వాలాబాగ్ ఊచకోత ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ న్యాయం కోసం చేసిన పోరాటం గురించి తెలియజేయనున్నట్లు సమాచారం. వినాశకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత వెనుక ఉన్న నిజమైన సత్యాన్ని చూపించనున్నారు. అయితే ఇందులో అనన్య పాండే, ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కేసరి-2’ మూవీ ఏప్రిల్ 18న థియేటర్స్‌లో రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ‘కేసరి-2’ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ రావడం గమనార్హం. ఇక దీని రన్‌టైమ్ 2గంటల 15 నిమిషాల 6 సెకండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ పోస్ట్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story