చేతులు జోడించి దండం పెడుతున్నా.. అభిమానులకు స్టార్ హీరో కీలక విజ్ఞప్తి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీ పలు హిట్ సినిమాల్లో నటించిన ఆయన స్టార్ హీరోగా మారాడు.

చేతులు జోడించి దండం పెడుతున్నా.. అభిమానులకు స్టార్ హీరో కీలక విజ్ఞప్తి.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీ పలు హిట్ సినిమాల్లో నటించిన ఆయన స్టార్ హీరోగా మారాడు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాకుండా పలు తెలుగు చిత్రాల్లోనూ విలన్‌గా కనిపించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు(Mahesh Babu), ఎన్టీఆర్, రవితేజ(Ravi Teja), రామ్ పోతినేని బాలకృష్ణ(Balakrishna) వంటి వారితో నటించారు. అయితే కరోనా సమయంలో సోనూసూద్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఎంతోమందికి తనవంతు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. వలస కూలీలకు అండగా నిలబడి వారికి అవసరం అయినవి అందించారు. అంతేకాకుండా ఓ ట్రస్ట్‌ను ప్రారంభించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డబ్బు సాయం చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.

ఇక రెండేళ్ల తర్వాత సోనూసూద్ ‘ఫతే’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ హిట్ సాధించలేకపోయారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, సోనూసూద్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ‘‘ఇటీవల నా భార్యకు యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలిసిందే. అందుకే ప్రతి ఒక్కరూ కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ లేకపోతే మీరు మీ కుటుంబాన్ని కోల్పోయినట్లే. వెనుక సీటులో కూర్చున్నప్పటికీ సీట్ బెల్ట్ పెట్టుకోండి’’ అని చెప్పుకొచ్చారు. అలాగే చేతులు జోడించి దండం పెట్టే ఎమోజీని కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మీరు చెప్పింది నిజమే సార్. గుడ్ మెసేజ్ అందించారని ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story