- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోయిన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శక్తి శాలిని’ వాయిదా.. ఇక ఇప్పట్లో లేనట్టే అంటూ షాకింగ్ ట్వీట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) ఇటీవల ‘గేమ్ చేంజర్’(Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) ఇటీవల ‘గేమ్ చేంజర్’(Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక ఆమె తదుపరి నటించే ప్రాజెక్ట్స్ అన్నింటికి సడెన్ బ్రేక్ పడినట్లు అయింది. దీంతో మూవీ మేకర్స్ అయోమయంలో పడిపోయారు. అసలు ఒప్పుకున్న సినిమాలు అయినా షూటింగ్ పూర్తి చేస్తుందని అంతా భావించారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాయిదా వేసుకుంటున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, కియారా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శక్తి శాలిని’(Shakti Shalini) కూడా వాయిదా పడినట్లు సమాచారం. మే నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో డెలివరీ అయ్యాక వచ్చే ఏడాది మధ్యలో మొదలు పెట్టనున్నట్లు టాక్. మాడ్‌డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాకు అజిత్ పాల్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇక కియారా బ్రేక్ ఇవ్వడం కారణం చిత్రబృందం మళ్లీ షెడ్యూల్ ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే వచ్చే ఏడాది ‘శక్తి శాలిని’ షూటింగ్ జరిగితే.. 2027 నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.






