- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి వద్దే వద్దు కానీ అది మాత్రం కావాలి అంటూ స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నారు. అలా 40 ఏళ్లు దాటిన మ్యారేజ్ చేసుకొని వారు చాలా మందే ఉన్నారు. అందులో బాలీవుడ్ అందాల భామ దివ్యా దత్తా(Divya Dutta) ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటి మాత్రమే కాదు మోడల్, రచయిత్రి కూడా.. ఈ బ్యూటీ ఎక్కువగా హిందీ, పంజాబీ, మలయాళం, ఇంగ్లీష్ సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామకు.. ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్న ఎదురైంది.
దానికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. ‘ “తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే, సొంతంగా సంతోషంగా ఉండటం మేలు. నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు, కానీ నాతో పాటు ప్రయాణం చేయగల ఒక పార్ట్‌నర్ ఉంటే బాగుంటుంది. అలాంటి వ్యక్తి లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను” అని తెలిపింది. కాగా 47 సంవత్సరాల వయసున్న దివ్య ఈ కామెంట్స్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీనికి నెటిజన్లు పార్ట్‌నర్ కూడా ఎందుకు సింగిల్ గానే ఉండిపోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






