- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2026లో ఇలా ఉండాలనుకుంటున్నానంటూ బెడ్ రూమ్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. షాక్‌లో నెటిజన్స్
ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్(Kajal) ఒకరు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కాజల్(Kajal) ఒకరు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత గౌతమ్ గిచ్లూలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక మ్యారేజ్ చేసుకున్న ఈ చిన్నదానికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే బాబు పుట్టిన కొన్ని రోజుల వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ‘సత్యభామ’(Satyabhama) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా తెలుగులో ‘కన్నప్ప’(Kannappa) మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ అందుకుంటుంది.
మరో పక్క ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బెడ్ మీద గాగుల్స్ పెట్టుకొని స్టమక్ మీద ల్యాప్ ట్యాప్ పెట్టుకొని చేతిలో టీ కప్ పట్టుకున్న ఫొటోతో పాటు, చేతిలో మందు బాటిల్, గ్లాస్ పట్టుకున్న పిక్, మేకప్ చేయించుకుంటున్న ఫొటో, వాష్ బేసిన్ మీద కూర్చొని లిప్ స్టిక్ వేసుకుంటున్న పిక్, బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఉన్న కిర్రాక్ ఫొటో షేర్ చేసింది.
ఇక వాటికి.. ‘2025, మీరు దయగలవారు. కృతజ్ఞత గల హృదయంతో, దృఢమైన స్ఫూర్తితో, ఎంతో ప్రేమతో 2026లోకి అడుగుపెడుతున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఏంటి 2026 ఇంత లేజీగా ఉండాలనుకుంటున్నావా అంటూ షాక్ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్టార్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






