Samantha: ఆ వ్యాధి సంకేతాల్ని 60.1% తగ్గిస్తోన్న పికిల్‌బాల్ ఆట.. అద్భుతంగా వివరించిన సమంత

by Kodari Anjali |   (  Updated:2025-06-10 06:22:24  IST  )

పికిల్ బాల్ ఆట వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.

Samantha: ఆ వ్యాధి సంకేతాల్ని 60.1% తగ్గిస్తోన్న పికిల్‌బాల్ ఆట.. అద్భుతంగా వివరించిన సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: పికిల్ బాల్ ఆట వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఆపిల్ అండ్ ఇతరులు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, సాధారణ జనాభాతో పోలిస్తే పికిల్‌బాల్ నిరాశ చెందిన మానసిక స్థితి సంకేతాల అవకాశాలను 60.1% తగ్గిస్తుందని చెప్పుకొచ్చింది. యువ ఆటగాళ్లలో (8-18 సంవత్సరాల వయస్సు), 90% మంది ఇది వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని తెలిపింది. 98% మంది ఇది వారి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. పెద్దల (ఎక్కువగా 50+) సమీక్షలో శ్రేయస్సు, జీవిత సంతృప్తి, తగ్గిన ఒత్తిడి, నిరాశ, ఆనందంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని వెల్లడించింది.

అలాగే మరిన్ని వివరాల కోసం THEKITCHENPICKLE.COM ని సందర్శించండి @ది కిచెన్ పికిల్ బాల్ అని లింక్ కూడా జోడించింది. సమంత సినిమాల విషయానికొస్తే.. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ.. తనదైన సత్తా చాటుతోంది. నిర్మాతగా మారి తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది. నటిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా కూడా మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Next Story