టాలీవుడ్‌లో హాట్ టాపిక్: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ సమంత!

by Gantepaka Srikanth |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ సమంత!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామ్ త్వరలోనే తల్లి కాబోతోందంటూ గత రెండు రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సమంత ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌లో సామ్ కొద్దిగా బేబీ బంప్' (గర్భవతిగా ఉన్నట్లు)తో కనిపించారంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

స్పందించని సమంత టీమ్..

ఈ వార్తలపై అటు సమంత గానీ, ఇటు ఆమె సన్నిహితులు లేదా దర్శకురాలు నందిని రెడ్డి టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఖండించనూ లేదు. దీంతో ఈ సస్పెన్స్ మరింత పెరిగింది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనా.. లేక నిజంగానే ఏదైనా గుడ్ న్యూస్ ఉందా? అనేది తెలియాలంటే సమంత స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ‘మా ఇంటి బంగారం' సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. సమంత నటనకు, నందిని రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఒకవైపు సినిమా సక్సెస్, మరోవైపు ప్రెగ్నెన్సీ రూమర్స్‌తో ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత పేరే మారుమోగిపోతోంది.

Next Story